ఒక్క రాత్రి నిద్రలేకపోతే..మెదడు వయసు రెండేళ్లు పెరగుతుందట.. పరిశోధనలో తేలిన నిజం

-

మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం..కానీ మనం తిండిమీద పెట్టిన శ్రద్ధ నిద్రమీద పెట్టం.. ఏం పని లేకపోయినా..అర్ధరాత్రి వరకూ మేలుకుంటారు.. నైట్‌ షిప్ట్‌లు చేసే వాళ్లంటే.. తప్పదు అనుకోవచ్చు.. కానీ కొంతమంది అయితే..సోషల్‌ మీడియాలో అవి ఇవి అని తేడాలేకుండా ఏవేవో చూస్తా.. రాత్రి రెండు దాటిస్తారు.. ఒక్కరాత్రి నిద్ర లేకపోతే.. మీ మెదడు వయసు రెండేళ్లు పెరుగుతుందట.. ఈ లెక్కన నైట్‌ షిఫ్ట్‌ చేసే వాళ్ల పరిస్థితేంటో.. తాజా అధ్యయనంలో తేలిన షాకింగ్ నిజం..!

పరిశోధన ఎలా జరిగిందంటే..

జర్నల్‌ ఆఫ్‌ న్యూరో సైన్స్‌లో వివరాలు ప్రచురితం చేశారు.. ఎమ్ఆర్ఐ స్కాన్ ద్వారా నిద్రలేమితో బాధపడే వ్యక్తుల మెదళ్లను పరిశోధకులు పరిశీలించారు. అయితే అదే వ్యక్తులు ఒక రాత్రి నిద్రపోయినప్పుడు వారి మెదళ్లను పరిశీలించారు. నిద్రలేమితో ఉన్నవారి మెదడులో కలిగిన మార్పులు కూడా పరిశోధన చేశారు. నిద్రలేమితో ఉన్నవారి మెదడు రెండు సంవత్సరాలు పెద్దయ్యాక ఉన్న మెదడులాగా ఉండటం పరిశోధకులు గమనించారు. జర్మనీలోని RWTH ఆచెన్ విశ్వవిద్యాలయంతో సహా అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ విషయాన్ని తెలిపింది.

ఒక్క రాత్రి నిద్రలేకుండా ఉండడం వల్ల మీ మెదడుకు ఏళ్లు పెరుగుతాయని ఈ అధ్యయనం కనుగొంది. జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్‌లో కనిపించిన అధ్యయనంలో ఒక రాత్రి నిద్ర లేమి మెదడు వయస్సు రెండు సంవత్సరాలు పెరుగుతుందని తేలింది. నిద్ర కోల్పోవడం అనేది మానవ మెదడును అనేక స్థాయిలలో విస్తృతంగా ప్రభావితం చేస్తుంది. అనేక నిద్ర లక్షణాలలో వయసు సంబంధిత మార్పులు, తగ్గిన నిద్ర నాణ్యత వృద్ధాప్యం లక్షణం సూచిస్తున్నాయి. నిద్ర భంగం వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది.. ఎవరైతే రోజూ రాత్రుళ్లు మేల్కొంటారో..వారు త్వరగా ముసలివాళ్లు అయిపోతారట.. పరిశోధకులు మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగించి మెదడు వయస్సు అంచనాలను నిద్రలేమి వ్యక్తుల మెదడు MRI స్కాన్‌ల నుంచి రూపొందించారు. ఒక రాత్రి పూర్తి నిద్ర లేమి మెదడులో ఒకటి లేదా రెండు సంవత్సరాల వృద్ధాప్యం తర్వాత కనిపించే మార్పులను చూపిస్తున్నట్లు స్పష్టంగా తేల్చారు..

నిద్ర లేమి ఉన్నవారి మెదడుల్లో ద్రవం పంపిణీ, గ్రే మ్యాటర్ పరిమాణంలో మార్పులతో సహా అనేక రకాల మార్పులు జరుగుతాయని ఆధారాలు ఉన్నాయి. వయసు పెరిగితే ఏం అవుతుందిలే అని డౌట్‌ మీకు రావొచ్చు.. మెదడు వయసు పెరుగుతుంది అంటే..మీరు రెండేళ్ల తర్వాత మీలో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో అవి అన్ని ముందే వచ్చినట్లే.. మెదడు చరుకుతనం కోల్పోతుంది. మతిమరుపు వస్తుంది..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.. వీలైనంత వరకూ పగలు పని చేసి రాత్రుళ్లు నిద్రపోవడానికే ప్రయత్నించండి. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి ఇంకోటి ఉండదు..

Read more RELATED
Recommended to you

Exit mobile version