ప్రతీ రోజు వీటిని అనుసరిస్తే.. మీ ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదు..!

-

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యంగా ఉండటం కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..? అయితే తప్పకుండా ప్రతి రోజు వీటిని పాటించండి. వీటిని కనుక ఫాలో అయ్యారంటే మీ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా మీ దరి చేరవు. అయితే మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

 

శుభ్రత పట్ల స్పెషల్ ఎటెన్షన్ ని పాటించండి. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రత లేకపోతే ఆరోగ్యం బాగుండదు.
ఆహారం తినే సామాన్లు, ఫ్రిడ్జ్, ఓవెన్ వంటివి శుభ్రంగా ఉంచుకోండి.
అలానే మీరు కిరాణా సామాన్లు పెట్టే చోట కూడా శుభ్రత పాటించండి. తీసుకునే ఆహారం తాజాగా ఉండేటట్లు చూసుకోండి.
తాజా కూరలు, పండ్లు మాత్రమే తీసుకోండి.
అలానే మసాలా సామాన్లు, పప్పులు మొదలైన వాటిని అన్నింటినీ కూడా మంచిగా స్టోర్ చేసుకోండి. ఎక్స్ పైర్ అయిపోయిన వాటిని ఉపయోగించకండి. వంటల్లో ఎక్కువ నూనె వాడకండి. నూనె వల్ల సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అలానే వండుకునేటప్పుడు సరైన టెంపరేచర్ లో వండండి.
నూనె ఉపయోగించేటప్పుడు సోయాబీన్, సన్ ఫ్లవర్, మొక్కజొన్న లేదా ఆలివ్ ఆయిల్ ని వాడండి.
అలాగే షుగర్ మరియు సాల్ట్ ని లిమిట్ గా వాడుతూ ఉండండి.
జంక్ ఫుడ్ ని అస్సలు తీసుకోవద్దు.
అలానే సాఫ్ట్ డ్రింక్స్ ని కూడా తీసుకోకండి.
మీరు నిద్రపోయే చోట కూడా శుభ్రత ఉండేట్టు చూసుకోండి.
ప్రతిరోజు మెడిటేషన్, యోగా, వ్యాయామం వంటివి అనుసరించండి. మెట్లు ఎక్కుతూ ఉండటం నడవడం లాంటివి చేస్తూ ఉండండి.
ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలను ఇంట్లో ఫాలో అవ్వడం వల్ల శుభ్రతతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందరికి ఇవి తెలిసినప్పటికీ బద్దకిస్తూ ఉంటారు కానీ ఈ చిన్న చిన్న చిట్కాలను కూడా అనుసరించారు అంటే మీ ఆరోగ్యానికి ఎలాంటి చింత ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news