మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చెయ్యండి.. లేకుంటే భారీ నష్టం జరుగుతుంది..

-

టెక్నాలజీ రాకెట్ కన్నా స్పీడ్ గా అభివృద్ధి చెందుతుంది.. అంతే స్పీడుగా నేరాలు కూడా పెరుగుతున్నాయి. స్మార్ట్‌ ఫోన్లలో మాల్‌వేర్ మరోసారి కలకలం రేపుతోంది. ఈ సారి ఏకంగా రెండు వందలకు పైగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ప్రమాదకరంగా గుర్తించారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. వీటిలో కొన్ని పాపులర్ యాప్స్ కూడా ఉన్నాయి. మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలిట్ చేయండి.

ఈ యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌ను కంట్రోల్ చేసి, మీ బ్యాంక్ ఖాతాలను కూడా యాక్సెస్ చేస్తాయి. దాంతో బ్యాంకు అకౌంట్ ఖాళీ అవుతుంది.. మొన్నటివరకు ఏదొక లింక్స్ ద్వారా టార్గెట్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా యాప్ లనే టార్గెట్ చేశారు.. ఆ యాప్లను థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించాయి. 203 ప్రమాదకరమైన యాప్స్‌ను గుర్తించిన ఈ సంస్థలు వీటిని తొలగించాలంటూ గూగుల్, యాపిల్‌ను కోరాయి. ఈ యాప్స్‌ని లక్షలాది మంది యూజర్లు డౌన్‌లోడ్ చేశారని అంచనా.

ఒకవేళ మీ డివైజ్‌లో ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుంటే మీ బ్యాటరీ డ్రెయిన్ లేదా పరికరం పనితీరు మందగించడం లాంటివి మార్పులును గమనిస్తారు. కనుక మీ స్మార్ట్‌ఫోన్ పనితీరులో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే అవసరం లేని యాప్స్ డిలిట్ చెయ్యడం ఉత్తమం.. లేదంటే డేటాను బ్యాకప్ చేసి ఫోన్ ను రీసెట్ చెయ్యాలి. అలాంటివి చెయ్యడం వల్ల అకౌంట్ డీటైల్స్ హ్యాక్ అవ్వవు.. ముందు ఈ పని చెయ్యండి.. లేదంటే ఖతం.. డబ్బులు పోయినాక ఏం చేస్తే ఏం ప్రయోజనం..

Read more RELATED
Recommended to you

Latest news