దానిమ్మ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు తినకుండా వదలరు..!

-

దానిమ్మను కొంతమంది తినడానికి అస్సలు ఇష్టపడరు. కారణం వేరే పండు తిన్నంత ఈజీగా వీటిని తినలేరు. కానీ ఇందులో విటమిన్ బి, సి మరియు కె, ఇంకా యాంటీఆక్సిడెంట్లు పుష్కళంగా లభిస్తాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వృద్యాప్య ఛాయలును రాకుండా చేస్తుంది.ఇలాంటి దానిమ్మను మనలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని ఆహారనిపుణులు సూచిస్తూ ఉంటారు

1. లైంగిక కోరికలను పెంచడానికి..
మగవారు దీనిని ఎక్కువగా తినడం వల్ల ఇందులో లభించే పోషకాలు టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిని పెంచి తద్వారా లైంగిక కోరికలను పెంచుతాయి. దీనివల్ల సంతానసౌపల్యం పెరిగే అవకాశం ఉంటుంది.

2).కీళ్ల నొప్పులు తగ్గించడానికి:కీళ్లవాతం మరియు ఆర్థరైటిస్ తో బాధపడేవారు,వీటిని తరుచుగా తీసుకోవడం వల్ల ఫ్లేవనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గించటానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

3. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:దానిమ్మలో ఉండే యాంటీయాక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్ పెంచి, హానికారక లిపిడ్లను విఛ్చిన్నం చేస్తాయి. దీనితో గుండెసంబంధిత రోగాలు దరిచేరవు.

4).క్యాన్సర్ కణాలను నిరోదిస్తాయి:దానిమ్మగింజల వలన ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. అంటే యాంటియాక్సిడెంట్లు,క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ ను నిరోధిస్తాయి.

5).మధుమేహ నివారణకు:సాధారణంగా మధుమేహం ఉన్నవారు దానిమ్మ తియ్యగా ఉంటుందని దానిని ఎక్కువగా తీసుకోరు. కానీ మధుమేహం ఉన్నవారికి దానిమ్మ చాలా బాగా ఉపయోగపడుతుంది.దానిమ్మగింజలలో కొన్ని ప్రత్యేక యాంటీఆక్సిడెంట్లు వల్ల ఇవి టైప్ 2డయాబెటిస్ ను సైతం తగ్గించడంలో సహాయపడతాయి.

6).పళ్ళ ఆరోగ్యానికి:దానిమ్మ గింజలు చిగుళ్ళను బలపరచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.ఈ గింజలు నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి, క్యావిటీస్ రాకుండా కాపాడుతాయి.

7).జీర్ణశక్తిని పెంచుతుంది:దానిమ్మ గింజలు జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి కావలసిన బి- కాంప్లెక్స్ విటమిన్లు, పైబర్ ఏంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థని మెరుగు పరుస్తాయి. అధికబరువు తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.

8).రోగనిరోధకశక్తి పెంచడానికి..
ఇందులో ఉండే యాంటీయాక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచి, సీజనల్గా వచ్చే రోగాలను రాకుండా నిరోధిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version