చాలా మందికి రక్తం తక్కువగా ఉంటుంది. దీనితో ఇబ్బంది పడతారు. రక్తం పెరిగేందుకు అనేక రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఎక్కువగా గర్భిణీలలో ఈ సమస్య కలుగుతూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు వీటిని డైట్ లో తీసుకుంటే కచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ సమస్య నుండి దూరంగా ఉండొచ్చు. మరి రక్తహీనత సమస్యని ఎలా దూరం చేసుకోవాలి..? వీటిని తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. హిమోగ్లోబిన్ పెరగాలంటే ఈ కూరగాయల్ని డైట్లో తీసుకోవడం మంచిది. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే రక్తం పెరుగుతుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడంతో రకరకాల సమస్యలు వస్తాయి.
తోటకూరను తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది సోడియం పొటాషియంతో పాటు ఐరన్ ఉంటుంది దీంతో రక్తం పెరుగుతుంది. ఖర్జూరం కూడా ఆరోగ్యనికి మంచిది. ఖర్జూరం పండ్లను తీసుకుంటే కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి ఎనిమియా తో బాధపడే వాళ్ళకి ఇది దివ్య ఔషధం. మునగాకు కూడా బ్లడ్ ని పెంచుతుంది. మునగాకులో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
అలానే బీట్రూట్ కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచేందుకు సహాయపడుతుంది ఐరన్ మెగ్నీషియన్ బి కాంప్లెక్స్ బీట్రూట్ లో ఎక్కువగా ఉంటాయి. అలానే నువ్వులు కూడా బ్లడ్ కంటెంట్ ని పెంచుతుంది. తృణధాన్యాలు కూడా బ్లడ్ కంటెంట్ ని పెంచడానికి సహాయ పడతాయి. దానిమ్మని రోజు తీసుకుంటే కూడా బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది చూశారు కదా ఏ కూరగాయలను తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది అనేది మరి వీటిని డైట్ లో తీసుకుని ఏ బాధ లేకుండా ఆనందంగా జీవించండి.