ఈ చెట్టును పూజిస్తే..సిరిసంపదలు రెండూ పెరుగుతాయి…!!

-

చెట్లు మానవాలికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ప్రాణ వాయువును అందించడం తో పాటు ఎన్నో ఉపయోగాలను అందిస్తుంది.అయితే కొన్ని చెట్లకు పూజలు చేస్తే దరిద్రాలు పోయి సిరిసంపదలు వెల్లువిరుస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ఆ చెట్లు ఏంటి..ఎలా పూజించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

జమ్మి చెట్టు:

మన శాస్త్రాల్లో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి రోజూ సాయంత్రం జమ్మి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా మీ ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యాపారం కూడా పూరోగమిస్తుందని విశ్వసిస్తారు. ప్రతి రోజూ సాయంత్రం ఇంటి దేవాలయంలో సంధ్యా వందనం ముగిశాక కచ్చితంగా జమ్మిచెట్టు కింద దీపాన్ని వెలిగించడం. ఇంటి నుంచి బయటకు వెళ్లే దిశలో బయట జమ్మి చెట్టును నాటాలి. ఈ స్థలం ఎల్లప్పుడు శుభ్రంగా, చక్కగా ఉంచుకోవాలి. శనివారం లేదా విజయదశమి రోజు వర్తింపజేయడం ఉత్తమం. ప్రతి శనివారం జమ్మిచెట్టు కింద ఆవ నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల శని నుంచి బయట పడవచ్చు..

రావి చెట్టు:

ఈ చెట్టు ఆరోగ్య పరంగా మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. ఆధ్యాత్మిక కోణం పరంగానూ ఇది చాలా ప్రత్యేకమైందిగా పరిగణించబడుతుంది. పితృదేవతలు రావిచెట్టుపై నివసిస్తారని, దీన్ని ఆరాధించడం ద్వారా మన ప్రార్థనలు నేరుగా చేరుతాయని చెబుతారు. రావి చెట్టుపై ప్రతి శనివారం దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా శని నుంచి మనకు ప్రయోజనం లభిస్తుంది.

అరటి చెట్టు:

అరటి చెట్టు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. గురువారం అరటి చెట్టును ఆరాధించడం ద్వారా చాలా పవిత్రంగా భావిస్తారు. అరటి చెట్టును ఆరాధించడం వల్ల శ్రీహరి కూడా సంతృప్తి చెందుతాడని నమ్ముతారు. ప్రతి గురువారం మినపప్పు, బెల్లంతో అరటి చెట్టును పూజిస్తారు. గురువారం ఉపవాసం పాటించేవారు అరటి చెట్టును పూజించి నీటిని అర్పిస్తారు…

ఇవి కాక తులసి, మనీ ప్లాంట్లను కూడా పూజిస్తె శని నుంచి ఉపశమనం కలుగుతుంది.. సిరిసంపదలు వెల్లువిరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version