అందరినీ హడలు కొట్టే” శివకు “చుక్కలు చూపించిన బిగ్ బాస్ ఇనయ..!!

-

21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఆరుగురు కంటెస్టెంట్లకు చేరుకుంది. మిగతా సీజన్‌ల కంటే ఈ సీజన్ చప్పగా సాగుతుందనే రూమర్ ఉంది. అయినా బిగ్‌బాస్ 6ను చూసేవాళ్లు లేకపోలేదు. ప్రారంభంతో పోలిస్తే కొద్దిగా మాత్రమే టీఆర్పీ రేటింగ్స్ పెరిగినట్లు తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో బాగంగా స్ట్రాంగ్ , ఫైర్ బ్రాండ్ అయిన ఇనయా ఎలిమినేషన్ అయ్యింది.

ఫైనల్ లో ఉండాల్సిన ఆమె హౌస్‌ నుంచి బయటకు వచ్చేయడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇకపోతే షో  నుండి వచ్చిన తర్వాత ఇనయ బిగ్‌బాస్‌ కెఫెలో యాంకర్‌ శివకు ఇంటర్వ్యూ ఇచ్చింది. వాస్తవంగా ఇంటర్వ్యూ కోసం ఎవరైనా వస్తే శివ దే పై చేయి ఉండేలా చూసుకుంటాడు. తన దైన శైలిలో అట్టాక్ చేస్తూ వారిని అయోమయంలో నెడతాడు. కాని ఈ సారి మాత్రం ఇనయా అతనికి తగ్గకుండా చుక్కలు చూపించింది.

నాకున్న నమ్మకంతో  టైటిల్‌ విన్నర్‌ నేనే అని అరిచాను అని కౌంటర్ ఇచ్చింది.సూర్యతో లవ్‌ ట్రాక్‌ వల్ల నీ గ్రాఫ్‌ తగ్గింది అని శివ చెప్పగా అతడిని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? అని తిరిగి ప్రశ్నించి ఇరుకున పడేసింది.రేవంత్‌ గురించి చెప్పమని శివ అడగడంతో అతడు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తాడంది ఇనయ. అచ్చం నీలాగే కదా అని యాంకర్‌ సెటైర్‌ వేయగా రేవంత్ గురించి చెప్పేటప్పడు నా టాపిక్ ఎందుకు నేనూ, తను ఒకేలా ఉంటామా అని ప్రశ్నించగా నాకు తెలీదని బదులిచ్చాడు శివ. మరి తెలియనప్పుడు నా గురించి ఎందుకు మాట్లాడావు అని నిలదీసింది. దీనితో శివ మోహం మాడిపోయింది. ఇది చూసిన నెటిజన్స్ ఇనయ పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version