ఏపీ ప్రజలకు మరో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. ఏపీలోని మీ సేవ కేంద్రాలలో సర్వీస్ ఛార్జీలను పెంచుతూ.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోమ వారం నుంచి ఈ పెంచిన ఛార్జీలను అమలు లోకి రానున్నాయి. కేటగిరి – ఏ, కేటగిరి – బీ కింద అందించే సేవలకు వసూలు చేసే ఛార్జీలను రూ.5 లకు పెంచేసింది సర్కార్.
సోమవారం నుంచి సర్వీసు ఛార్జీలను మార్పు చేస్తున్నట్లు మీ సేవ నిర్వాహకులకు సంబంధిత శాఖ నుంచి ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు వెళ్లాయి. సోమవారం నుంచే పెంచిన ఛార్జీలను అమలు అయ్యే విధంగా.. సాఫ్ట్ వేర్ కూడా అప్ డేట్ చేస్తున్నారు మీ సేవ నిర్వాహకులు.
మీ సేవ కేంద్రాల్లో ప్రభుత్వ విభాగాలకు సంబంధించి.. దాదాపు 500 పైగా రకాల సేవలు అందుతున్నాయి. ఈ సేవలకు సర్వీసు ఛార్జీల కింద ఏ కేటగిరి సేవలకు రూ.35… బి కేటగిరి సేవలకు రూ.45 వంతున ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ ప్రజలకు మీ సేవ ఛార్జీల పెంపు భారం పడనుంది.