టీ20 వరల్డ్ కప్-2024లో భాగంగా సెయింట్ లూసియాలోని డారెన్ సామి స్టేడియం వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సృష్టించారు.
అంతర్జాతీయ T20ల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్గా నిలిచారు. మిగతా ఏ ఆటగాడు అతడి దరిదాపుల్లో లేరు. 173 సిక్సర్లతో రెండో ప్లేస్లో న్యూజిలాండ్ కు చెందిన గప్టిల్ ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్ విధ్వంసకర ఆటగాడు బట్లర్ (137), మాక్స్ వెల్ (133), పూరన్ (132), సూర్య కుమార్ (129) ఉన్నారు. కాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో రోహిత్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు.స్టార్క్ వేసిన మూడో ఓవర్లో ఏకంగా 4 సిక్సర్లు, ఒక ఫోర్ బాదారు. దీంతో ఆ ఓవర్లో ఒక వైడ్తో కలిపి మొత్తం 29 రన్స్ వచ్చాయి.