టీ20 వరల్డ్ కప్-2024లో భాగంగా సెయింట్ లూసియాలోని డారెన్ సామి స్టేడియం వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్ కి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
భారత్ ఓపెనర్లలో విరాట్ కోహ్లీ డకౌట్ గా వెనుదిరిగాడు. ఇక మరో ఓపినర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు.అంతర్జాతీయ T20ల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్గా నిలిచారు.స్టార్క్ వేసిన మూడో ఓవర్లో ఏకంగా 4 సిక్సర్లు, ఒక ఫోర్ బాదారు. దీంతో ఆ ఓవర్లో ఒక వైడ్తో కలిపి మొత్తం 29 రన్స్ వచ్చాయి.కెప్టెన్ రోహిత్(92) విధ్వంసానికి తోడు సూర్య (31) మెరుపులు మెరిపించడంతో ఇండియా భారీ స్కోర్ చేయగలిగింది. శివము దూభే 28 రన్స్ , హర్డిక్ పాండ్య 27 పరుగులు, పంత్ 15 పరుగులు చేశారు.ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, స్టోయినిస్ తలో 2, హజెల్ వుడ్ ఒక వికెట్ తీశారు. ఆస్ట్రేలియా టార్గెట్ 206 పరుగులు.