ఆసీస్ తో భారత్ తొలి వార్మప్‌ మ్యాచ్‌.. బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

-

టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఆరంభానికి ముందు భారత్ జట్టు రెండు వార్మప్ మ్యాచులు ఆడనుంది. వీటిలో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా మొదటి మ్యాచ్‌ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎంచుకుంది.
అసలు సమరంలోకి దిగేముందు సభ్యుల ఫిట్‌నెస్‌, ఫామ్‌ను పరీక్షించుకోవడానికి భారత్‌, ఆసీస్‌కు ఇదొక చక్కని అవకాశం. కరోనా నుంచి కోలుకొని వచ్చిన షమీకి తుది జట్టులో స్థానం కల్పించలేదు.  ప్రాక్టీస్‌ సందర్భంగా మధ్యలో కొన్ని ఓవర్లు వేసే ఛాన్స్‌ ఉంది. షమీతోపాటు చాహల్‌ను బౌలర్లుగా వినియోగించుకొనేందుకు టీమ్‌ ఇండియా సిద్ధమైంది.
ఈ పిచ్ ఆరంభంలో స్వింగ్, సీమ్‌కు అనుకూలిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పెర్త్‌లో ఆడిన ప్రాక్టీస్ మ్యాచుల్లో తాము ఎంత సిద్ధమయ్యామో అర్థమైందని, ఈ రెండు వార్మప్ మ్యాచులతో టోర్నీకి పూర్తిగా సిద్ధమవుతామని రోహిత్ సేన అంటోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version