విశాఖపట్నం లేదు కదా ఐదు టెస్టులలో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండవ టెస్టులో నాలుగో రోజు 106 రన్స్ తేడాతో ఇండియా ఘనవిజయం సాధించింది.దీంతో ఇంగ్లీష్ టీం పై గెలిచిన టీమ్ ఇండియాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విరాట్, జడేజా, సిరాజ్, రాహుల్, షమీ, హార్దిక్ లాంటి స్టార్ ప్లేయర్లు లేకపోయినా సత్తా చాటడం అద్భుతమని ప్రశంసలు కురిపిస్తున్నారు. రోహిత్ కెప్టెన్సీకి తోడు జైస్వాల్, గిల్, బుమ్రా, అశ్విన్ అదరగొట్టారని పేర్కొంటున్నారు. భవిష్యత్తు జట్టుకు డోకా లేదంటున్నారు. వికెట్ పడటంతో ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడం, వెనుక జాతీయ జెండా ఉన్న ఫొటో ఆకట్టుకుంటోంది.
ఈ టెస్టులో ఇండియా యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (209), గిల్ (104) చెలరేగిపోయి ఆడారు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి బుమ్రా 9 వికెట్లతో చెలరేగారు. ఇంగ్లీష్ టీం బ్యాటర్లలో జాక్ క్రాలే రెండు ఇన్నింగ్స్ లో 149 రన్స్ తో రాణించగా మిగిలిన ఆటగళ్లంతా సత్తా చాట లేకపోయారు. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయ్యింది.