ఇండియాలో థర్డ్‌ వేవ్‌ ప్రకంపనలు.. ఒక్క రోజే 2.47 లక్షల కేసులు

-

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,47,417 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,018,358 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 11,17,531 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. రోజు వారి కరోనా పాజిటివిటీ రేటు 13.11 గా నమోదు అయింది. అయితే.. నిన్నటితో పోల్చితే… ఇవాళ 27 శాతం కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 46,569 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 34,321,803 కు చేరింది. ఇక ఇండియాలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 5,488 కు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 84 825 మంది కరోనా నుంచి కోలు కున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news