శ్రీలంక వర్సెస్ భారత్ మధ్య మూడు వన్డే సిరీస్ లో భాగంగా ఇవాళ మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఘోరంగా ఓటమి పాలైంది. శ్రీలంక బౌలర్ల దాటికి టీమిండియా కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. భారత్ అలవొకగా ఛేదిస్తుందనుకుంటే శ్రీలంక స్పిన్నర్ల ధాటికి ఛేదించలేకపోయింది.
ముఖ్యంగా శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలాగే 5 వికెట్లు తీసి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ(35), విరాట్ కోహ్లీ (20), శ్రేయస్ అయ్యర్ (8), అక్షర్ పటేల్ (2), కుల్దీప్ యాదవ్ (6) వికెట్ల వెల్లలాగే తీశాడు. రియాన్ పరాగ్ (15), శివందూబే (09) వికెట్లను వండర్ సే తీశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ నే టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో వాషింగ్టన్ పోరాడాడు. అయినప్పటికీ టప్ప టప్ప వికెట్లు పడటంతో టీమిండియా సిరీస్ ను కోల్పోయింది. దాదాపు 27 ఏళ్ల తరువాత శ్రీలంక ఇవాళ వన్డే సిరీస్ ను గెలుచుకోవడం విశేషం.