కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వరుసగా ఐదవ సారి తన బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ బడ్జెట్ పై ప్రసంగిస్తూ.. దేశం వృద్ధిరేటు శరవేగంగా పెరుగుతుందన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. ప్రపంచ సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ దీటుగా ఎదుర్కొని నిలబడిందన్నారు.
జి20 అధ్యక్ష బాధ్యతలతో భారత్ కీలక ప్రస్తానాన్ని ప్రారంభించింది అన్నారు నిర్మల సీతారామన్. భారతదేశ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అన్నారు. వృద్ధిరేటు 7 % ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు నిర్మల సీతారామన్. దేశంలో గత తొమ్మిదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందన్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతదేశం సిద్ధంగా ఉందన్నారు. ఇక భారత్ లో డిజిటల్ యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగాయని తెలిపారు.