లైఫ్ లో సక్సెస్ ని అందుకోవడం అంటే ఈజీ కాదు. లైఫ్ లో సక్సెస్ ని అందుకోవడానికి టైం పడుతుంది పైగా ఎంతటి వాళ్ళైనా సరే సక్సెస్ ని చేరుకోవడం కష్టం, దానికి తగ్గ విధంగా కష్టపడాలి అప్పుడే లైఫ్ లో సక్సెస్ ని పొందగలము. నౌనూర్ కౌర్ కి 27 ఏళ్లు వీళ్ళది లూధియానా ఈమె సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలను సంపాదిస్తోంది.
50 సంవత్సరాల నుండి బెల్లం మార్కెట్ భారతదేశంలో ఒకే విధంగా ఉంది విడిగా అమ్ముతారు ఎటువంటి బ్రాండ్లు ఉండవు. దీనితో ఆమె కి ఒక ఐడియా వచ్చింది. బెల్లం కోసం ఒక బ్రాండ్ అనేది మొదలు పెట్టాలని అనుకున్నారు ఈమె ఎంబీఏ పూర్తి చేసింది 2019లో MBA ని పూర్తి చేసింది ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా బెల్లాన్ని పంచదారకి బదులుగా వాడుతున్నారు.
అటువంటప్పుడు నాణ్యమైన బెల్లాన్ని అందించాలి అని ఈమె అనుకున్నారు దీనికోసం తగిన రీసెర్చ్ ని కూడా ఈమె చేశారు. తన వంట గది నుండి ఈమె దీనికి తగ్గ రీసెర్చ్ ని మొదలు పెట్టింది ఏ విధంగా బెల్లాన్ని తయారు చేయాలి ఏ విధంగా ప్యాక్ చేయాలి ఇటువంటివన్నీ కూడా ఈమె తెలుసుకున్నారు. రోడ్ సైడ్ మొక్కలు ఉంటాయి దీంతో పొల్యూషన్ దుమ్ము ఇవన్నీ కూడా ఉంటాయి ఇలా వచ్చే సమస్యలను ఈమె గుర్తించారు.
ఈమె బెల్లం కోసం ప్రత్యేకించి రైతుల నుండి చెరుకుని కొనుగోలు చేస్తుంది దాంతో బెల్లాన్ని తయారుచేసి సేల్ చేస్తారు నాణ్యత విషయంలో ఏమాత్రం తగ్గరు. 22 మంది రైతులు లుదియనలో చెరుకు ని వీళ్ళ కోసం పండిస్తున్నారు 200 ఎకరాల చెరుకు సంవత్సరానికి పండిస్తున్నారు. రైతులు ప్రతి నెలా 1000 కేజీల బెల్లాన్ని వీళ్ళు అమ్ముతున్నారు. యూఏఈ, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలకి కూడా సప్లై చేస్తారు. ఇలా ఈమె లైఫ్ లో సక్సెస్ ని అందుకున్నారు. అనుకున్నట్లుగా చక్కటి లాభాలని పొందుతున్నారు.