ఏపీలోని రాజధాని ప్రాంతం అమరావతిలో ఎవరూ ఊహించని విధంగా ఆసక్తికరమైన ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. దారి పొడవునా వెళ్లే వారంతా వాటిని చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఏమిటవి అనుకుంటున్నారా? సోషల్ మీడియాను ప్రస్తుత రోజుల్లో ఏ విధంగా ఉపయోగించాలనే సమాచారాన్ని ఆ ఫ్లెక్సీలలో పొందుపరిచారు.
ప్రజల గౌరవాన్ని, నైతిక విలువలు కాపాడడమే లక్ష్యంగా దేశానికే ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు కూటమి ప్రభుత్వం పేర్కొన్నది.
సోషల్ మీడియాలో ఎవరూ చెడు పోస్టులు పెట్టరాదని ఫ్లెక్సీలలో స్పష్టం చేసింది. ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించేలా పోస్టింగ్స్ చేసిన వారి విషయంలో కఠిన చట్టాలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం కుండబద్దలు గొట్టింది. గతంలో ప్రభుత్వంపై అనుచిత కామెంట్స్ చేసిన వైసీపీ నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.