ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైకా రాజధాని ఉండాలని గత కొద్ది రోజుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ రైతులు, మహిళలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా అమరావతి పరిరక్షన సమితి ఆధ్వర్యంలో మహా పాదయాత్ర కూడా నిర్వహించారు. అయితే ఈ రోజు అమరావతి పరిరక్షణ సమతి బహిరంగా సభ ను తిరుపతి లో నిర్వహించారు. ఈ బహిరంగా సభ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎంపీ రాఘురామ కృష్ణం రాజు మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది.
వైసీపీ ఎంపీ గా రాఘురామ కృష్ణం రాజు ఉన్నా.. ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ ప్రభుత్వం పై ప్రతి సారి విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. అలాగే అమరావతి ఉద్యమానికి కూడా ఎంపీ రఘురామ మద్దత్తు తెలిపారు. అయితే ఎంపీ రఘురామ చంద్రబాబు డైరెక్షన్ లో నే ఇలా ప్రవర్తిస్తున్నాడని వైసీపీ నేతలు పలు మార్లు ఆరోపించారు. అయితే ఈ రోజు తిరుపతి బహిరంగ సభ లో టీడీపీ అధినేత చంద్రబాబును ఎంపీ రఘురామ ఆలింగనం చేసుకున్నారు. దీంతో వైసీపీ నేతలు గతంలో చేసిన ఆరోపణలు మరో సారి ముందుకు వచ్చాయి.