మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఐశ్వర్య రాయ్ పాత్రలో నెగెటివ్ షేడ్స్..!!

-

భారతదేశం గర్వించే దర్శకుల్లో ఒకరు క్రియేటివ్ జీనియస్ మణిరత్నం అని చెప్పొచ్చు. ఆయన తీసిన గ్రాండియర్ ఫిల్మ్ ‘పొన్నియన్ సెల్వన్-1’ ఈ నెల 30న విడుదల కానుంది. పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానున్న ఈ చిత్రం కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 10వ శతాబ్దంలో చోళరాజుల కాలానికి సంబంధించిన స్టోరిగా ఈ సినిమా రాబోతున్నది.

ప్రముఖ రచయత కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే చారిత్రక నవల ఆధారంగా పిక్చర్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో భారీ తారాగణమే ఉంది. ఆస్కారు అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కాగా, ఈ మూవీలో ఐశ్వర్యరాయ్ పాత్రపైన సోషల్ మీడియాలో రకరకాల వార్తలొస్తున్నాయి.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఐశ్వర్య రాయ్ పాత్ర ‘నందిని’ కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. గతంలో మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్ ‘ఇరువర్(ఇద్దరు)’ అనే సినిమాలో నటించింది.

ఇక ‘పొన్నియన్ సెల్వన్-1’ విషయానికొస్తే… ఇందులో ఐశ్వర్య పాత్ర లో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని అంటున్నారు.

రాణిగా నటిస్తూనే రాజ్య శ్రేయస్సు కోసం ‘నందిని ’ తీసుకునే నిర్ణయాలు కొంచెం విభిన్నంగా ఉంటాయని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి.. ఐశ్వర్య పాత్ర సినిమాలో ఎలా ఉండబోతున్నదనేది వెండితెరపైనే చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news