రేపు మైసూర్‌ యోగా కార్యక్రమంలో మోడీ..

-

రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో యోగా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. మైసూరు ప్యాలెస్‌లో ప్రధానమంత్రితో పాటూ 15,000 మందికి పైగా యోగా ప్రదర్శనలో పాల్గొంటున్నారని పీఎంవో వెల్లడించింది. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ యోగా ఫర్ హ్యుమానిటీ గా వెల్లడించింది. గత రెండు సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో యోగ దినోత్సవాన్ని ఆన్ లైన్ లో నిర్వహించారు. ఈ సంవత్సరం కరోనా తగ్గిన నేపథ్యంలో ప్రత్యక్షంగా యోగా దినోత్సవం నిర్వహించనున్నారు.

Yoga has gained tremendous popularity globally: PM Modi

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా, భారతదేశంలోని 75 ఐకానిక్ ప్రదేశాలలో యోగా ప్రదర్శనలు, వేడుకలను కేంద్ర ప్రభుత్వం జరుపుతోంది. 75 ప్రదేశాలలో నిర్వహించే యోగా ప్రదర్శనలో కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. అయితే.. రేపు మోడీ పాల్గొననున్న మైసూర్‌ యోగా ప్రాంతాన్ని ఇప్పటికే భద్రత బలగాల ఆధీనంలోకి వెళ్లిపోయింది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news