డొనాల్డ్ ట్రంప్‌ – ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ.. 20 కోట్ల మందికిపైగా శ్రోతలు

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఎలాన్‌ మస్క్‌ ఇంటర్వ్యూ ఇప్పుడు సెన్సేషన్గా మారింది. ఈ కార్యక్రమాన్ని ఏకంగా 200 మిలియన్ల మందికిపైగా విన్నారు. దీనిపై మస్క్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. 200 మిలియన్ల శ్రోతలను దాటేసే దశలో ఉందని తెలిపారు. అయితే ప్రధాన మీడియా ట్రంప్ సంభాషణను పట్టించుకోలేదని మస్క్ మండిపడ్డారు. ఈ ఇంటర్వ్యూ కొనసాగుతుండటానే ట్రంప్‌ ఎక్స్‌ హ్యాండిల్‌ 200 మిలియన్లకు పైగా ఇంప్రెషన్లను అందుకొన్నట్లు ట్రెండింగ్‌ పాలిటిక్స్‌ సహయజమాని కొల్లిన్‌ రోగ్‌ వెల్లడించారు.

మరోవైపు ట్రంప్‌ ఇంటర్వ్యూ సమయంలో ఎక్స్ పై సైబర్‌ దాడి జరిగిందని ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. తమ మాధ్యమంపై భారీగా డీడీఓఎస్‌ దాడి జరిగిందని మస్క్ పోస్టు చేశారు. ఈ లైవ్‌ ఇంటర్వ్యూకు తొలుత సాంకేతిక సమస్య ఎదురవ్వడంతో 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా చాలా మంది యూజర్లకి ఈ ఇంటర్వ్యూ ఆడియో వినిపించలేదు. అయినా 20 కోట్ల మంది వీరి సంభాషణను విన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version