తాలిబన్లు పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో ఆహార సంక్షోభంలో కొట్టుకులాడుతుంది. ప్రస్తుతం ఆ దేశంలో రోజుకు భారీ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి అని పశ్చిమ ఆసియా ఐరాస ప్రతినిధి బృందం పేర్కొంది.
ఆఫ్ఘసిస్తాన్ లో ప్రస్తుతం 95 శాతం ప్రజానీకానికి రోజువారీ సరిపడా తినడానికి తిండి కూడా దొరకడం లేదని , సరైన ఆహారం లేకపోవడంతో అక్కడి పిల్లలు వ్యాధులకు గురై మృత్యువాత పడుతున్నారు అని ఆ బృంద ప్రతినిధులు తమ నివేదికలో పేర్కొన్నారు.
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ని కైవశం చేసుకున్న తర్వాత దేశంలో కరువు పరిస్థితులు, వ్యవసాయ రంగం పూర్తి దెబ్బతినడంతో పాటుగా ఆహార ఎగుమతులు , దిగుమతులు తగ్గడంతో పనులు లేక ఆ దేశంలోని ప్రజలు దారిద్య్రంలోకి వెళ్లిపోతున్నారు.