అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ఆమె అద్భుతమైన, అందమైన మహిళ అని, ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ఆమె మరణానికి గల కారణాలను పేర్కొనలేదు. 1977లో ట్రంప్, ఇవానా పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా 1990లో విడాకులు తీసుకున్నారు. 1993లో నటీ మర్లాను ట్రంప్ రెండో పెళ్లి చేసుకున్నారు. ట్రంప్ ప్రస్తుత భార్య పేరు మిలీనియ ట్రంప్.
తనని 1998లో న్యూయార్క్లో ఒక ఫ్యాషన్ వీక్ లో కలిసింది. అయితే అప్పటికే డోనాల్డ్ ట్రంప్ తన రెండవ భార్యకు విడాకులు ఇచ్చారు. 1820 నుండి ఇప్పటివరకు ఉన్న ప్రథమ మహిళలో మొదటి విదేశీయురాలైన ప్రధమ మహిళ. డోనాల్డ్ ట్రంప్ కి ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఐదుగురు పిల్లలు ఉన్నారు. 2016 నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
'SHE WAS AN ICON': @JudgeJeanine describes Ivana Trump as an 'incredible woman' in wake of her passing. pic.twitter.com/fzj7gBFVAw
— Fox News (@FoxNews) July 15, 2022