ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు….. పాక్ అణ్వాస్త్రాలు సురక్షితంగా లేవని కామెంట్స్

-

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవీ దిగిపోయినా… ఏదో రకమైన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల పాక్ నేషనల్ అసెంబ్లీలో పెట్టిన అవిశ్వాస తీర్మాణంతో ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగిపోయాడు. అమెరికా ఆడిన రాజకీయ క్రీడలో బలైపోయానంటూ… తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. తాజాగా ఆయన పాక్ ప్రజలు అభిమానాన్ని చూరగొనే ప్రయత్నంలో ఉన్నాడు. వరసగా ప్రజా ర్యాలీలతో పాల్గొంటున్నాడు. తాను రష్యాలో పర్యటించడం అమెరికాకు నచ్చలేదని.. అందుకే తనను గద్దె దించేలా ప్రతిపక్షాలతో అవిశ్వాసం పెట్టించిందని.. ఇది విదేశీ కుట్ర అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తాజాగా మరోసారి ఇమ్రాన్ ఖాన్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ‘ పాకిస్తాన్ లో అణ్వాస్త్రాలు సురక్షితంగా ఉన్నాయా..? ’ అంటూ కొత్తగా ఎన్నికైన ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బుధవారం పెషావర్ లో జరిగిన ఓ రోడ్ షోలో ఇమ్రాన్ ఖాన్… దొంగలు, దోపిడిదారుల చేతిలో అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయా అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

కాగా.. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై పాక్ సైన్యం స్పందించింది. పాక్ అణ్వాయుధాలు సురక్షితంగా ఉన్నాయని… రాజకీయాల్లోకి వీటిని తీసుకురాకూడదని హితవు పలికింది. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను పాక్ సైన్యం కొట్టిపారేసింది. మా అణు కార్యక్రమాలకు ఎలాంటి ముప్పు లేదని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news