ఇజ్రాయెల్-హమాస్ భీకర యుద్ధం.. 1100కు పైగా చేరిన మృతుల సంఖ్య

-

పశ్చిమాసియాలో నెత్తురు ఏరులై పారుతోంది. హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో ఆ ప్రాంతాల్లో మృత్యువు తాండవిస్తోంది. ఎటుచూసిన రక్తపాతం.. హాహాకారాలు. రాకెట్ల వర్షంతో విధ్వంసం కళ్లకు కడుతోంది. హమాస్‌తో అధికారిక యుద్ధానికి ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ కేబినెట్‌ ఆమోదం తెలపడంతో ఆ దేశ సైన్యం గాజా స్ట్రిప్‌పై బాంబులతో విరుచుకుపడుతోంది.

ఈ దాడుల్లో ఇప్పటివరకు ఇరువైపులా 1100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. డజన్లకొద్దీ రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌తో ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలపై హెజ్‌బొల్లా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. పాలస్తీనా పోరాటానికి సంఘీభావంగా రాకెట్లు, షెల్స్‌ను ప్రయోగించినట్లు హెజ్‌బొల్లా గ్రూప్‌ ప్రకటించగా.. ఈ దాడులను ఇజ్రాయెల్‌ దళాలు తిప్పికొట్టాయి.

మరోవైపు ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా, హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్లు రంగప్రవేశం చేశాయి. వీటి మద్దతు ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. హమాస్ ఉగ్రవాదుల దాడులను సమర్థవంతంగా అడ్డుకునేందుకు ఇజ్రాయెల్‌కు సహాయంగా తూర్పు మధ్యధరా సముద్రానికి ఫోర్డ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను పంపించనున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version