చైనా యాప్ కి పాకిస్తాన్ లోనూ తప్పలేదు..

-

చైనాకి చెందిన టిక్ టాక్ యాప్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరి ఫోన్లో టిక్ టాక్ యాప్ ఉండేదంటే అతిశయోక్తి కాదేమో. చిన్న చిన్న వీడియోలు చేసి టిక్ టాక్ ద్వారా పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఐతే ఈ యాప్ లో మనం ఇచ్చే సమాచారానికి భద్రత లేని కారణంగా ఇండియా టిక్ టాక్ యాప్ ని నిషేధించింది. తాజాగా అమెరికా కూడా టిక్ టాక్ ని బ్యాన్ చేసింది.

ఐతే తాజాగా చైనా మిత్ర దేశమైన పాకిస్తాన్ కూడా టిక్ టాక్ యాప్ బ్లాక్ చేసింది. ఈ మేరకు అధికారిక సమాచారం బయటకి వచ్చింది. బూతు కంటెంట్ ని ప్రమోట్ చేస్తుందన్న కారణంగా పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ, టిక్ టాక్ షార్ట్ వీడియో యాప్ ని పాకిస్తాన్ బ్లాక్ చేస్తున్నామంటూ నోటీసు విడుదల చేసింది. పాకిస్తాన్ అనగానే ఎక్కువ ఆసక్తి చూపించే చైనా వారు ఇప్పుడేం చేస్తారో చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news