అణ్వాయుధాలను పెంచుకుంటున్న పాకిస్తాన్.. అమెరికా నివేదికలో నిజాలు

ఫెడరల్ ఆఫ్ అమెరికన్ ఇన్స్టిట్యుషన్ వెలువరించిన తాజా వివరాల ప్రకారం పాకిస్తాన్, తన అణ్వాయుధాలను పెంచుకుంటూ పోతుందని తెలిపింది. పాకిస్తాన్ వద్ద ఇప్పటికే చాలా అణ్వాయుధాలు ఉన్నాయని, ఇంకా మరిని అణ్వాయుధాలను పెంచుతుందని ప్రకటించింది. 2025నాటికి మొత్తం 200న్యూక్లియర్ వార్ హెడ్స్ పాకిస్తాన్ వద్ద ఉంటాయని నివేదిక వివరించింది. అణ్వాయుధాలు, షార్ట్ రేంజ్, లాంగ్ రేంజ్ మిస్సైల్ పై పాకిస్తాన్ ఖర్చు చేస్తుందని నివేదిక సమాచారం.

ఇస్లామాబాద్ కి దగ్గరలో యురేనియం ఫ్లుటోనియం కర్మాగారాలను పాకిస్తాన్ నడుపుతుందని, అణ్వాయుధాలకు అవసరం అయ్యే ఈ మూలకాలను మరింత పెంచుకుంటుందని, కొని వేల కిలోమీటర్ల దూరాన్ని చేధించడానికి పనికొచ్చే మిస్సైల్స్ పాకిస్తాన్ వద్ద ఉన్నాయని అమెరికా నివేదిక ప్రకటించింది. ఉగ్రవాదానికి ఆశ్రయంగా ఉన్న పాకిస్తాన్, అణ్వాయుధాలను పెంచుకోవడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి.