పాకిస్థాన్ రాజకీయం…. ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మాణం

-

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్ లు తగులుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ దాదాపుగా గద్దె దిగడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఆయన పై నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ ఈ తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మాణానికి 161 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. దీంతో డిప్యూటి స్పీకర్ అనుమతితో షెహబాజ్ హుస్సెన్  అవిశ్వాస తీర్మాణం  ప్రవేశపెట్టారు. ఈ తీర్మాణంపై  ఈ నెల 31న చర్చ చేపట్టనున్నారు.

ఇమ్రాన్ ఖాన్ | imran khan

దేశంలో ఆర్థిక పరిస్థితులు దిగజరాడానికి ఇమ్రాన్ ఖాన్ సర్కార్ కారణం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ మద్దతు ఇస్తున్న వారంతా.. మెల్లిమెల్లిగా దూరం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ముగ్గురు మంత్రులు ఇమ్రాన్ ఖాన్ కు మద్దతు ఉపసంహరించారు. మొత్తం 342 మంది ఉండే సభ్యుల్లో 172 మంది మద్దతు ఉంటేనే ఇమ్రాన్ ఖాన్ సర్కార్ నిలుస్తుంది. కానీ ప్రస్తుతం

అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇమ్రాన్ ఖాన్ కు మద్దతు ఇస్తున్న 4 పార్టీలు కూడా ప్రస్తుతం మద్దతును ఉపసంహరించడంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్.

Read more RELATED
Recommended to you

Latest news