యూకే -ఇండియా ఫ్యూచర్ ఫారం: ఈ భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది..!

-

ఇండియా గ్లోబల్ ఫోరమ్ (IGF) వార్షిక UK-ఇండియా పార్లమెంటరీ లంచ్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో
బుధవారం నాడు జరిగింది. జేమ్స్ క్లీవర్లీ స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఇరువురి రిలేషన్ కూడా భవిష్యత్తు కి చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. విదేశాంగ, కామన్వెల్త్ మరియు అభివృద్ధి వ్యవహారాల కార్యదర్శి జేమ్స్ మాట్లాడుతూ.. గ్రీన్ ఏకోనోమిక్ డెవెలప్మెంట్ తో ఇండియా ముందు ఉందని.. దూసుకుపోతోంది అని అన్నారు.

 

అలానే మీతో మంచి భాగస్వాములుగా ఉండటానికి ఆసక్తిగా ఉన్నాము అన్నారు. ఇండియా ప్రెసిడెన్సీ అఫ్ ది G20 హోస్ట్ చేస్తుందని.. దాని కోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను అన్నారు. అలానే ఆ అవకాశాన్ని వెనక్కి తీసుకునే ఛాన్స్ లేదన్నారు. ఉత్తేజకరమైనది ఇది అని కూడా అన్నారు ఆయన. అలానే కామన్వెల్త్ స్నేహితులం మేము అన్నారు. ఒక కుటుంబంలో భాగం అని కూడా చెప్పారు.

విక్రమ్ దొరైస్వామి అయితే చరిత్ర నిజంగా చాలా ముఖ్యమైన గైడ్ అని అన్నారు. చరిత్ర మనకి ఏముంది… మనం దేని నుండి వచ్చాము… ఎలా వచ్చాము కలిసి ఉండడం కోసం ఏ దారి నుండి వచ్చాము అని చెప్పారు. అయితే కేవలం గతాన్ని చూసి స్నేహాన్ని ముందుకు తీసుకు వెళ్లలేమని స్నేహం మనం షేర్ చేసుకున్న విలువలు గత విలువలు మీద ఆధారపడి ఉండాలి అని చెప్పారు. అలానే మనం చూసే దారి రెండు ప్రజాస్వామ్యాలు అని విక్రమ్ అన్నారు. అయితే వాళ్లు భావిస్తున్నట్లు మొత్తం అందరూ కూడా భావిస్తే యూకే ఇండియా పార్ట్నర్ షిప్ ఎన్నో ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు.

జూన్లో వార్షిక యుకె ఇండియా షెడ్యూల్ చేశారు. యూకే ఇండియా ఫ్యూచర్ ఫారం లాంచ్ కోసం పార్లమెంటరీ లంచ్ ఏర్పాటు చేశారు. ఇండియా ఫ్యూచర్ ఫోరమ్, IGF న్యూ డైనమిక్ కంట్రీ బిజినెస్ లీడర్స్, పాలసీ మేకర్స్ ని కనెక్ట్ చేయడానికి తీసుకు వచ్చారు. రెండు దేశాల మధ్య ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కి సపోర్ట్ ఉండాలని దీని ప్రధాన లక్ష్యం. కరోనా సమయంలో వ్యాక్సిన్స్ మొదలు ఇండో-పసిఫిక్‌లో రక్షణ మరియు భద్రతా దాకా ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం ఏర్పడింది. అయితే ఇప్పుడు కూడా అదే భాగస్వామ్యం ఈ లక్ష్యం కోసం కూడా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news