ఐపీఎల్ 2023: పర్పుల్ క్యాప్ ను దక్కించుకున్న లెగ్ స్పిన్నర్ చాహల్ !

-

ఐపీఎల్ లో రాత్రి జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ కోల్కతా పై తన జూలు విదిల్చింది. ఏకంగా వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకుంది. అన్ని విభాగాలలో కోల్కతాను ఆటాడుకుంది. ముందుగా కోల్కతాను 149 పరుగులకే పరిమితం చేసి షాక్ ఇచ్చింది. కోల్కతాను ఇంత తక్కువ స్కోర్ కు కట్టడి చేయడంలో ఇండియా లెగ్ స్పిన్నర్ యఙవేంద్ర చాహల్ కీలకంగా వ్యవహరించాడు. తాను వేసిన 4 ఓవర్ ల స్పెల్ లో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. ముందుగా అప్పుడప్పుడే ప్రమాదకరంగా మారుతున్న వెంకటేష్ అయ్యర్ ను చక్కని అవుట్ అఫ్ ఆఫ్ స్టంప్ బంతితో అవుట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ నితీష్ రానాను సైతం చక్కని ఫీల్డ్ ప్లేసెమెంట్ ను సెట్ చేసుకుని తన వలలో చిక్కుకునేలా చేశాడు.

ఇక యంగ్ లాడ్ రింక్ సింగ్ మరియు ఠాకూర్ లను అవుట్ చేసి కోల్కతాను ఎక్కువ స్కోర్ చేయనీయకుండా అడ్డుకున్నాడు. దీనితో చాహల్ 12 మ్యాచ్ లలో 21 వికెట్లను సాధించి పర్పుల్ కాప్ ను అందుకునే జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news