ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య 10వ మ్యాచ్ జరుగుతోంది. కోల్ కతా తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ (83) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో 182 పరుగులు చేసింది. గ్రీన్(33), మ్యాక్స్ వెల్(28) ఫరవాలేదనిపించారు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో రస్సెల్ 2, హర్షిత్ రాణా 2, నరైన్ 1 వికెట్ తీశారు.
ఇదిలా ఉంటే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మిచెల్ స్టార్క్ అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే. మినీ వేలంలో అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు దక్కించుకుంది. అయితే ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు 2 మ్యాచులాడిన అతడు.. ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. మొత్తం 8 ఓవర్లు వేసిన స్టార్క్.. ఏకంగా 100 పరుగులు ఇచ్చారు. దీంతో అతడి ప్రదర్శనపై నెట్టింట చర్చ జరుగుతోంది.