IPL Auction : నిద్ర‌పోతున్నారా.. స‌న్ రైజ‌ర్స్ పై ట్రోల్స్

-

బెంగ‌ళూర్ వేదిక‌గా ఐపీఎల్ మెగా వేలం జ‌రుగుతుంది. ఈ రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి వేలం ప్రారంభం అయింది. శ్రేయ‌స్ అయ్యార్ ను అత్య‌ధికంగా రూ. 12.25 కోట్ల‌కు ద‌క్కించుకుంది. అలాగే అన్ని ఫ్రొంఛైజీలు వేలంగా నాణ్య‌మైన ఆట‌గాళ్ల కోసం బిడ్ లు వేస్తున్నాయి. కానీ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఆట‌గాన్ని కూడా కొనుగోలు చేయ‌లేదు. మూడో సెట్ న‌డుస్తున్నా.. ఒక్క ఆట‌గాన్ని కూడా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ దక్కించుకోలేదు.

దీంతో నెటింట్లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై ట్రోల్స్ మోగుతున్నాయి. నిద్ర‌పోతున్నారా.. అంటూ నెటిజ‌న్లు స‌న్ రైజ‌ర్స్ విప‌రీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. కాగ స‌న్ రైజ‌ర్స్ రిటెన్షన్ ప్ర‌క్రియాలో కేన్ విలియ‌మ్ స‌న్ తో పాటు అబ్దుల్ స‌మ‌ద్ తో పాటు ఉమ్ర‌న్ మాలిక్ ను అట్టిపెట్టుకుంది. దీని త‌ర్వాత స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ద్ద రూ. 68 కోట్ల నిధులు ఉన్నాయి. అయితే భారీగా నిధులు ఉన్నా.. ఆట‌గాళ్లును ఎందుకు కొనుగోలు చేయ‌డం లేద‌ని ట్రోల్స్ వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news