నేడు క్వాలిఫయర్ 1… ఢిల్లీ క్యాపిటల్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు

ఐపీఎల్ 14 వసీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. నేడు జరిగే క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో గెలుపుతో ఫైనల్ కు చేరే ఒక జట్టు ఏదనేది తెలుస్తుంది. దుబాయ్ వేదికగా నేడు క్వాలిఫయర్1 మ్యాచ్ జరుగనుంది. తొలి రెండు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. సీనియర్ ఆటగాళ్లతో డాడీస్ ఆర్మీగా పేరు తెచ్చుకున్న చెన్నై, పూర్తిగా యువకులతో నిండి ఉన్న ఢిల్లీ క్యాపిటల్ ల మధ్య పోరు రసవత్తంగా ఉండబోతోంది.

గెలిచిన జట్లు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. లీగ్ దశలో 10 విజయాలతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, 9 విజయాలతో చెన్నై రెండోస్థానంలో ఉంది. చెన్నై ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 9 సార్లు ఫైనల్ కు చేరగా, 3 సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ కప్పు గెలవని జట్టుగా ఢిల్లీ ఉంది.