ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ.. విశాఖపట్నం నుండి కాశ్మీర్…వివరాలివే..!

-

చాలా మందికి ప్రయాణాలు అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తే చాలా బాగుంటుంది. కాశ్మీర్ చాలా అందమైన ప్రదేశం. మీరు కూడా కాశ్మీర్ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే విశాఖపట్నం నుంచి కాశ్మీర్ వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. మరి ఇక వాటి వివరాలని చూసేద్దాం. ఎంచక్కా ఫ్లైట్‌లో వెళ్లి కాశ్మీర్ అందాలు చూసి వచ్చేయచ్చు. మంచిగా సరదాగా ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు.

ఇక పూర్తి వివరాలని చూస్తే.. కాశ్మీర్-హెవెన్ ఆన్ ఎర్త్ అనే పేరుతో ఈ ప్యాకేజీ ని తీసుకు వచ్చారు. విశాఖపట్నంనుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. అందమైన కొండలు, లోయలు, ప్రకృతి అందాలను చూసేసి రావచ్చు. 2023 ఫిబ్రవరి 24, మార్చి 10, మార్చి 24 తేదీల్లో ఈ కాశ్మీర్-హెవెన్ ఆన్ ఎర్త్ ప్యాకేజీ అందుబాటులో ఉండనుంది. మొదటి రోజు విశాఖపట్నంలో ఈ టూర్ మొదలు కానుంది. విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రానికి శ్రీనగర్ రీచ్ అవుతారు.

రెండో రోజు ఉదయం శంకరాచార్య ఆలయం చూడచ్చు. మొఘల్ గార్డెన్స్, చెష్మా షాహి, పరి మహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్ ని కూడా చూసి వచ్చేయచ్చు. ఆ తరవాత దాల్ సరస్సు ఒడ్డునున్న హజ్రత్‌బాల్ క్షేత్రాన్ని కూడా చోడచ్చు. మూడో రోజు గుల్‌మార్గ్‌‌ ని చూసేయచ్చు. రాత్రికి శ్రీనగర్ వెళ్ళాలి. నాలుగో రోజు పహల్గామ్ వెళ్ళాలి. ఐదో రోజు సోన్‌మార్గ్ వెళ్ళాలి. ఇక్కడ థాజివాస్ గ్లేసియర్ దాకా వెళ్లడానికి పోనీలను అద్దెకు తీసుకోవచ్చు. సాయంత్రానికి శ్రీనగర్ రీచ్ అవ్వాలి. హౌస్‌బోట్‌లో డిన్నర్, స్టే ఉంటాయి. ఆరో రోజు మధ్యాహ్నం శ్రీనగర్‌లో స్టార్ట్ అయితే రాత్రికి విశాఖపట్నం రీచ్ అయ్యిపోతారు. ధరల విషయానికి వస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.39,120, డబుల్ ఆక్యుపెన్సీ రూ.39,910, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.49,305 గా వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version