ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నీటిపారుదల శాఖ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కొత్త కొలువులు వస్తున్నాయి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో 879 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
వేతన సవరణ సంఘం-2020 ప్రకారం పే-స్కేళ్లను ఖరారు చేసి, నియామకాలకు అర్హతలు, భర్తీ విధానం వంటి అంశాలపై మార్గదర్శకాలు రూపొందించనున్నారు తర్వాత భర్తీ బాధ్యతను టీఎ్‌సపీఎస్సీకి అప్పగించనున్నారు. ఏది ఏమైనా ఉద్యోగం కోసం చూసే వాళ్ళు ఎలర్ట్ అయ్యి అప్లై చేసుకోవడం మంచిది.
ఇక పోస్టులకి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. దీనిలో 879 పోస్టులల్లో కేటగిరీల వారీగా ఇలా ఉన్నాయి. 532 పోస్టులు వర్క్ ఇన్‌స్పెక్టర్, 109 ఎలక్ట్రీషియన్ పోస్టులు వున్నాయి. అంతే కాకుండా 45 ఫిట్టర్ పోస్టులు, 44 పంప్ ఆపరేటర్ పోస్టులు, 43 జనరేటర్ ఆపరేటర్ పోస్టులు.
79 ఫ్లడ్ గేట్ ఆపరేటర్ పోస్టులు, 11 వైర్ లెస్ ఆపరేటర్ పోస్టులు, 6 కుక్ పోస్టులు, 5 వెల్డర్ పోస్టులు, నాలుగు ల్యాబ్ అటెండెంట్ పోస్టులు, ఒక మెషిన్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయని తెలుస్తోంది.
వేరు వేరు పోస్టులకి వేర్వేరు అర్హతలు వున్నాయి. కొన్ని కేటగిరీలకు పదో తరగతి అర్హతతో పాటు ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు అప్లై చేఉస్కోవచ్చు. కుక్, ల్యాబ్ అటెండెంట్ మరియు మెషిన్ ఆపరేటర్ పోస్టులకు పదో తరగతి వాళ్ళు అర్హులు అవ్వచ్చు. అయితే త్వరలో విద్యార్హతలుతో పాటు మరిన్ని వివరాలని ప్రకటించనున్నారు.