సహజంగా మన శరీరానికి మంచినీరు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని రోగాలకి చికిత్సకంటే.. రోగాల భారిన పడకుండా ఉండటమే అతిముఖ్యమైనది. రోజుకు ఎంత వీలైతే అంత నీరు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. నీరు ఎక్కువగా సేవించడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువ శాతం మందికి భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. నిజానికి ఆహారంతోపాటుగా అనుసరించే అంశాలలో నీరు తాగడం కూడా ఒకటి అని చెప్పొచ్చు.
అయితే భోజనం చేసే సమయంలో నీరు తాగాలా వద్దా అన్న విషయంపై అపోహలున్నాయి. కానీ, భోజనం చివర నీరు త్రాగటం విషంతో సమానం. నీరు ఎంత గొప్పదయినప్పటికీ.. భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత తక్కువగా సేవించాలని గుర్తుంచుకోండి. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది. భోజనం చేసే సమయంలో ఎక్కువ నీరు తాగినప్పుడు జీర్ణాశయంలో విడుదలయ్యే హార్మోన్స్, యాసిడ్స్ గాఢత తగ్గిపోయి తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చేస్తుంది. దీంతో ఆ ఆహారం కుళ్ళి అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది.
ఆ కుళ్ళిన ఆహారం వల్ల వచ్చేది కొలెస్ట్రాల్. ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు. భోజనం తర్వాత నీరు తీసుకోవడం వల్ల శరీరంలో ఆమ్ల స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి అనేక జబ్బులకు కారణం అవుతుంది. నిజానికి భోజనం చేయడానికి అరగంట ముందు మరియు భోజనం చేసిన తర్వాత అరగంట వరకు నీళ్లు తాగకపోతే జీర్ణక్రియ కూడా ఎలాంటి సమస్యలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మిగిలిన సమయాల్లో మీకుఅనువుగా ఉన్న ప్రతి సందర్భంలోనూ నీటిని తాగడం చాలా మంచిది.