ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ?

-

ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత భారీ బడ్జెట్ లతో రిలీజ్ అయిన మూడు సినిమాలు సాహో, రాధే శ్యామ్ మరియు ఆదిపురుష్ లు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకే ఇక మీదట వచ్చే సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రభాస్ అండ్ టీం. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలలో సలార్ మరియు ప్రాజెక్ట్ కె లు ముందున్నాయి.. ఇప్పటికే సలార్ మూవీ చిత్రకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మరియు శృతి హాసన్ లు నటిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన విడుదల తేదీ ప్రకారం సెప్టెంబర్ 28వ తేదీన భారీగా రిలీజ్ కావాల్సి ఉండగా… ఎందుకో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడేలా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

కొందరు ఏమో సెప్టెంబర్ 6వ తేదీన రిలీజ్ అవనుంది అంటుంటే, మరికొందరు డిసెంబర్ లో రిలీజ్ చేస్తారంటూ అనుకుంటున్నారు. మరి ఎప్పుడు అన్నది తెలియాలంటే మూవీ టీం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version