గుండెలో మంట వస్తోందా..? అయితే వీటికి దూరంగా వుండండి..!

-

కొన్ని కొన్ని సార్లు గుండెల్లో మంట కలుగుతుంది. ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం తీసుకునే ఆహారం, జీవన విధానం మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అయితే చాలా మంది గుండెలో మంట సమస్యని ఎదుర్కొంటూ ఉంటారు ఇటువంటప్పుడు ఈ తప్పులు చేయొద్దు. ఇలా చేయకుండా ఇక్కడున్న ఈ చక్కటి విధానాలు అనుసరిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు.

గుండెలో మంట | Heart Burn

 

మంచి బాడీ వెయిట్ ని మెయింటైన్ చేయండి:

అధిక బరువు ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన బాడీ వెయిట్ ని మెయింటైన్ చెయ్యండి దీనితో సమస్యలు కూడా ఉండవు. బాగా లావుగా ఉంటే పొట్ట లో నుండి ఒత్తిడి ఎక్కువయ్యి గుండెల్లో మంటకి దారితీస్తుంది.

స్మోకింగ్ చేయొద్దు:

పొగాకు ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు అయినా సరే చాలా మంది స్మోక్ చేస్తూ ఉంటారు. స్మోకింగ్ వల్ల చాలా ప్రమాదాలు వస్తాయి. అలానే గుండెలో మంట కూడా వచ్చే అవకాశం ఉంది కనుక స్మోకింగ్ కి దూరంగా ఉండండి.

వ్యాయామం చేయడం:

వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతి రోజూ అరగంట పాటు వ్యాయామం చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. పైగా ఎన్నో అనారోగ్య సమస్యలు వ్యాయామంతో దూరం అయిపోతాయి కాబట్టి రెగ్యులర్ గా వ్యాయామం చేయండి.

కాఫీ, టీ మరియు సోడా తీసుకోవద్దు:

చాలా మంది ఎక్కువ మోతాదులో కాఫీ, టీ, సోడా తీసుకుంటూ ఉంటారు అయితే రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ వీటిని తీసుకుంటే ఇబ్బందులు వస్తాయని గ్రహించాలి.

హృదయ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్ధాలు:

హృదయ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్యలు రావు. పండ్లు, కూరగాయలు, చేప వంటివి తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ జరగకుండా ఉంటుంది కాబట్టి ఆహారంలో కూడా జాగ్రత్తగా చూసుకుని తీసుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news