శరీరంలో ఈ భాగాల్లో నొప్పిగా ఉందా..? కిడ్నీలు ప్రమాదంలో పడినట్లే..!

-

మనిషి సొసైటీలో బతకాలంటే నమ్మకం ఎంత ముఖ్యమో.. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉన్న అవయవాల్లో కిడ్నీలు కూడా అంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కిడ్నీలు ఫెయిల్‌ అయితే ఆ బాధ ఘోరంగా ఉంటుంది. ఈరోజుల్లో ఎంతో మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం.. లక్షణాలను ముందు గ్రహించకపోవడమే… మూత్రపిండాలు అనారోగ్యానికి గురైనప్పుడు శరీరంలోని ఏ భాగాల్లో నొప్పి వస్తుందో ఈరోజు చూద్దాం..!

కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఏయే భాగాల్లో నొప్పి ఉంటుందంటే..?

కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు.. ఆ వ్యక్తి ఛాతీ నొప్పి కూడా రావొచ్చు… కిడ్నీ, ఛాతీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. మూత్రపిండాల వైఫల్యం కారణంగా గుండెను కప్పి ఉంచే లైనింగ్ ఉబ్బుతుంది. దీని కారణంగా వ్యక్తికి ఛాతీ నొప్పితో సమస్యలు ఉండవచ్చు.

కిడ్నీ ఏదైనా లోపంతో ప్రభావితమైనప్పుడు లేదా మూత్రపిండాల్లోనే లోపం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి వెన్నునొప్పి సమస్య ఉండవచ్చు.మూత్రపిండము చాలా కాలం పాటు మూత్రాన్ని ఉత్పత్తి చేయలేకపోవడమే దీనికి కారణం. వ్యక్తి వెనుక భాగంలో నొప్పిని అనుభవించవచ్చు. మీరు కూడా చాలా కాలం పాటు వెన్నునొప్పితో బాధపడుతుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

పిల్లలకి కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు పొత్తి కడుపులో నొప్పిని కూడా అనుభవించవచ్చు. అయితే, మూత్రనాళంలో నొప్పి ఉంటే అది కూడా ఇన్ఫెక్షన్ లక్షణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, వ్యక్తి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

సో.. అల్టీమేట్‌గా కిడ్నీల సమస్యకు ప్రధాన కారణం.. మూత్రాన్ని ఆపుకోవడమే అవుతుంది. చాలామంది మూత్రాన్ని వివిధ కారణాల వల్ల హోల్ట్‌ చేసుకుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. కిడ్నీలు దెబ్బతింటే అది ప్రాణాంతకం కూడా అవతుంది. షుగర్‌ పేషెంట్స్‌కు షుగర్‌ లెవల్స్‌ పెరిగితే..దాని ప్రభావం కిడ్నీల మీదే దెబ్బతింటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కిడ్నీల ఫెయిల్‌ అవకుండా సరైన జీవనశైలి పాటించాలి. పైన పేర్కొన్న భాగాలలో మీకు ఎక్కువ నొప్పి అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news