రాయలసీమలో సీన్ రివర్స్..కానీ ఆధిక్యం మారలేదే!

-

రాయలసీమ అంటే వైసీపీ అడ్డా అని డౌట్ లేకుండా చెప్పవచ్చు. రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే రాయలసీమలో మాత్రం వైసీపీ హవా ఉంటుందనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవా స్పష్టంగా నడిచింది. మరి ఈ సారి ఎన్నికల్లో కూడా వైసీపీ హవా ఉంటుందా? అంటే డౌట్ లేకుండా ఉంటుందని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో సీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు కలిపి 52 సీట్లు ఉండగా, వైసీపీ 30 సీట్లు గెలుచుకోగా, టి‌డి‌పి 22 సీట్లు గెలుచుకుంది.

ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. 49 సీట్లు వైసీపీ గెలుచుకుంటే…టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకుంది. అంటే వైసీపీ ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సారి ఎన్నికల్లో వైసీపీ అదే స్థాయిలో విజయం సాధించడం కష్టమనే చెప్పాలి. వైసీపీకి ఈ సారి టి‌డి‌పి షాక్ ఇచ్చేలా ఉంది.

ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనే వైసీపీకి షాక్ తగిలిన విషయం తెలిసిందే. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ స్థానాల్లో టి‌డి‌పి విజయం సాధించింది. దీంతో సీమలో వైసీపీ పని అయిపోయిందని టి‌డి‌పి ప్రచారం చేస్తుంది. అయితే కొంతమేర వైసీపీకి నష్టం జరుగుతుందనే విషయం అర్ధమవుతుంది. కానీ పూర్తి స్థాయిలో సీమలో వైసీపీ బలం తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. సీమలో వైసీపీకే ఆధిక్యం ఉంటుందని చెప్పవచ్చు. కాకపోతే గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మాత్రం రావు.

గత ఎన్నికల్లో 49 సీట్లు గెలుచుకుంది..కానీ ఈ సారి 30 సీట్ల వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది..అటు టి‌డి‌పి 20 సీట్లు వరకు గెలుచుకోవచ్చు. కానీ ఎటు చూసుకున్న వైసీపీకే ఆధిక్యం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news