హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై ఐటీ దాడులు

-

హైదరాబాద్ నగరం లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. హెటిరో డ్రగ్స్, హెటిరో లాబ్స్ కు సంబంధించిన కార్యాలయాల పై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం ప్రారంభమైన ఈ ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తం 23 టీమ్ లు హెటిరో డ్రగ్స్, హెటిరో లాబ్స్ కు సంబంధించిన కార్యాలయాల పై ఐటీ సోదాలు చేస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని హెటిరో కార్యాలయాల పై ఏక కాలంలో ఈ 23 ఐటీ టీమ్ లు రైడ్స్ చేయడం అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. హైదరాబాద్ నగరం సనత్ నగర్ లోని హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్ ఆఫీసులో పై ఐటి దాడులు జరుగుతున్నాయి.

అలాగే జీడిమెట్ల లోని హెటిరో ల్యాబ్స్ యూనిట్ 3 కార్యాలయం పైన కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అటు ఏపీలోని విజయవాడ ఉన్న కార్యాలయాలపై కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version