మధుమేహం ఉన్నవారిలో కళ్లల్లో ఈ లక్షణాలు ఉంటే డేంజరే..

-

డయబెటిస్‌ అంటే చాపకింద నీరు లాంటిదే.. అది వచ్చేముందు వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఏం తేడాలుండవు.. ఆరోగ్యం బానే ఉంటుంది. బాగుంది కాదా.. అని మనం నిర్లక్ష్యం చేస్తే.. చిన్నగా లోపల ఒక్కో పార్ట్‌ను పాడుచేస్తూ వస్తుంది. డయబెటీస్‌ అంటే ముందు ఎఫెక్ట్ అయ్యేవి.. కళ్లు, కిడ్నీలే. డయబెటిస్‌ ఉన్న వాళ్లల్లో కళ్లలో ఇలాంటి మార్పులు కనిపిస్తే.. అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.. అవి ఎలాంటి మార్పులో చూద్దామా..! డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు నిర్ల‌క్ష్యం చేస్తే అనేక అవ‌య‌వాలు దెబ్బ తింటాయి. క‌ళ్లు క‌నిపించకుండా పోతాయి.

డయబెటీస్‌కు ఈ లక్షణాలు ఉన్నాయా..

కంటి చూపు స్ప‌ష్టంగా లేక‌పోవ‌డం.
దూరంగా లేదా ద‌గ్గ‌ర‌గా ఉన్న వ‌స్తువులు ప‌రిస‌రాలు మ‌స‌క‌గా క‌నిపిస్తుండ‌డం
ఒకే రంగుకు చెందిన భిన్న ర‌కాల షేడ్స్‌ను గుర్తించ‌లేక‌పోవ‌డం
క‌ళ్ల‌తో చూస్తున్న‌ప్పుడు చూపులో న‌ల్ల‌ని గీత‌లు, మ‌చ్చ‌లు క‌నిపించ‌డం
కాంతి తక్కువ‌గా ఉన్న ప్ర‌దేశంలో వ‌స్తువుల‌ను చూస్తుంటే క‌ళ్లుకు ఒత్తిడికి కలగడం..
ఈ ల‌క్ష‌ణాల‌న్నీ డ‌యాబెటిస్ ఉన్న‌వారిలో క‌ళ్ల‌కు వ‌చ్చే స‌మ‌స్య‌లు. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే ఏమాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించ‌రాదు. వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి క‌ళ్ల‌ను ప‌రీక్షలు చేయించుకోవాలి.
డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిర్లక్ష్యం చేస్తే క‌ళ్లు పై విధంగా ముందు ల‌క్ష‌ణాలు క‌న‌బ‌డి త‌రువాత చూపు పోయే ప్రమాదం ఉంది. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఇందుకుగాను స‌రైన ఆహారం తీసుకోవ‌డంతో పాటు రోజూ వ్యాయామం చేయాలి. వైద్యులు ఇచ్చే మందుల‌ను తూచా త‌ప్ప‌కుండా వేసుకోవాలి. డయబెటిస్‌ అంటేనే కళ్లు, కిడ్నీలు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు.. మనిషికి ఇవి రెండు చాలా ముఖ్యం..
మధమేహం ఉన్నవాళ్లు.. ముందుగా తమ జీవనశైలిని హెల్తీగా ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. వైట్‌ రైస్‌ను కంప్లీట్‌గా మానేయాలి. బ్రౌన్‌ రైస్‌ తినడం మంచిది. రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటి చిరుధాన్యాలతో చేసిన టిఫెన్స్‌ మాత్రమే తినాలి. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ కనీసం అరగంట పాటైనా నడవాలి. ఎక్కువ టెన్షన్‌కు, ఒత్తిడికి గురికావొద్దు. ఇలాంటి ఎన్నో జాగ్రత్తలను పాటిస్తే కానీ..మనకు డయబెటిస్‌ ఉంది అన్న విషయం తెలియకుండా హ్యాపీగా ఉన్నంత కాలం బతికేయొచ్చు.!

Read more RELATED
Recommended to you

Latest news