చెన్నైలో దారుణం.. ఢిల్లీ శ్రద్ధవాకర్ మర్డర్ తరహాలో ప్రియున్ని హత్య చేసిన మాజీ ప్రియురాలు

-

చెన్నైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డీల్లీ శ్రద్దావాకర్ మర్డర్‌ కేసు తరహాలోనే ప్రియుడ్ని హత్య చేసింది మాజీ ప్రియురాలు. అత్యంత కిరాతకంగా హతమార్చడమే కాకుండా.. అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చుట్టు పక్కల 400 కిలోమీటర్ల దూరంలో పాతి పెట్టింది ప్రియురాలు. మృతుడు ఎం జయంతన్‌ గా గుర్తించారు పోలిసులు. చెన్నై ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గ్రౌండ్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు జయంతన్.

గత నెల 18న సొంత ఊరు విల్లూపురం వెళ్తున్నట్లుగా ఇంట్లో చెప్పి వెళ్ళి మిస్ అయ్యాడు జయంతన్. దీంతో జయంతన్‌ కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసి జయంతన్‌ సోదరి ఇచ్చిన ఆధారాలతో కేసును చేధించారు పోలీసులు. పెళ్ళి చేసుకుని విడిపోయిన ప్రియురాలు భాగ్యలక్ష్మి హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు.

మార్చి 20వ తేదిన జయంత్‌ కాళ్లు, చేతుల్ని నరికి ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో తీసుకెళ్ళి చెన్నై సమీపంలోని కోవలం దగ్గర నిర్మాణుష్య ప్రదేశంలో ఖననం చేసింది భాగ్యలక్ష్మి. జయంతన్‌ మొండెం, ఇతర శరీర భాగాల్ని భాగ్యలక్ష్మి బ్యాగులో పెట్టుకొని మార్చి 26న చెన్నై సమీపంలోని కోవలం దగ్గర పాతిపెట్టినట్లుగా విచారణలో వెళ్లడైంది. వ్యభిచార వృత్తిలో ఉన్న భాగ్యలక్ష్మీని ప్రేమించి పెళ్ళడాడు జయంతన్.

Read more RELATED
Recommended to you

Latest news