జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. పవన్ నిత్య పెళ్లి కొడుకు.. కారును మార్చినట్లు పెళ్లాలను మారుస్తారంటూ ఘాటుగా విమర్శలు చేశారు. సోమవారం ప్రజా సంకల్పయాత్రలో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… ‘పవన్ కళ్యాణ్ చంద్రబాబు పార్టనర్.. నాలుగున్నరేళ్లు కలిసి కాపురం చేసి.. ఇప్పుడు విడిపోయినట్లు డ్రామాలాడుతున్నారు… తెర వెనుక దోస్తీ చేసుకొని.. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు అంటూ ఆరోపణలు చేశారు. చంద్రబాబు డైరెక్టర్.. పవన్ కళ్యాణ్ యాక్టర్.. నిర్మాత ఎవరో తెలుసా లింగమనేని. పవన్ ఓ నిత్య పెళ్ళికొడుకు.. నాలుగేళ్లకు ఒకసారి కొత్త కారు మార్చినట్లు పెళ్లాలను మారుస్తారు.
రెండో భార్య రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ తీరుపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే.. పవన్ అభిమానులు ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.. పవన్ కళ్యాణ్ తీసిన సినిమాకి అజ్ఞాతవాసి చంద్రబాబు.. ఏ సినిమాకు ఇవ్వని రాయితీలు ఇవ్వలేదా? ఆ రాయితీలతో పవన్ కోట్లాది రూపాయలు సంపాదించలేదా అంటూ వివరించారు. .. ఇది అవినీతి కాదా.