మోడీ చెప్పిన జగన్ వినట్లేదు : చంద్రబాబు

-

ఇటీవలే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వివిధ వర్గాలతో వెబినార్ నిర్వహించిన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. దేశంలో శరవేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంపై… కరోనా వ్యాప్తి విషయంలో ఏపీ సర్కారు తీసుకుంటున్న చర్యలపై కూడా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో అత్యధిక జనాభా ఉండటం కారణంగానే… కరోనా వైరస్ కేసులు సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది అంటూ తెలిపారు చంద్రబాబు నాయుడు.

ప్రస్తుతం వివిధ దేశాలలో రెండవ దశ కరోనా వ్యాప్తి కూడా మొదలైంది.. విదేశాల్లో ఎంతో వ్యూహాత్మకంగా కరోనా వ్యాప్తి ఉన్న ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు అంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సమర్థవంతమైన కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రధాని మోడీ చెప్పిన వినడం లేదని చంద్రబాబు నాయుడు విమర్శించారు. కరోనా వ్యాప్తి తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మద్యం దుకాణాలు తెరవాలి పాఠశాలను తెరవాలని ఉత్సాహంతో జగన్ ఉన్నారని అంటూ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news