ఇటీవల విడుదలైన జాతీయ మీడియా సర్వేల్లో ఏపీలో వైసీపీ ప్రభంజనం ఇంకా కొనసాగుతుందని తేలిన విషయం తెలిసిందే…ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీ 19 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టీవీ. 18 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే సంస్థల సర్వేలు చెప్పాయి. అలాగే 17-23 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని టైమ్స్ నౌ సర్వేలో తేలింది.
అంటే ఎటు చూసుకున్న వైసీపీ 17-20 స్థానాలు వరకు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి…దీని బట్టి చూస్తే దాదాపు 120 పైనే ఎమ్మెల్యే స్థానాలని గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇక మళ్ళీ వైసీపీకి అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే జాతీయ మీడియా సర్వేలకు…పీకే టీం…వైసీపీ అధిష్టానానికి ఇచ్చిన సర్వేకు పొంతన ఉన్నట్లు కనిపించడం లేదు. తాజాగా 75 మంది ఎమ్మెల్యేలు. 10 మంది ఎంపీలపై వ్యతిరేకత ఉందని, వారికి నెక్స్ట్ సీటు ఇస్తే ఓడిపోవడం గ్యారెంటీ అని, కాబట్టి వీరిని మార్చాలని పీకే టీం..జగన్‌కు సూచించినట్లు టీడీపీ అనుకూల మీడియాలో కథనం వచ్చింది.
అయితే ఈ కథనంలో ఎంత నిజముందో తెలియదు గాని…వాస్తవానికి కొందరు ఎంపీలపై మాత్రం వ్యతిరేకత ఉందని చెప్పొచ్చు. ఏదో జగన్ గాలిలో గెలిచేశారు గాని…వారు ఎంపీలుగా ప్రజలకు చేసిన ఉపయోగం పెద్దగా లేదు..అలాగే పార్లమెంట్ లో రాష్ట్రం కోసం పోరాడిన సందర్భాలు తక్కువ. ఎటు చూసుకున్న కొందరు ఎంపీలపై ప్రజా వ్యతిరేకత ఉంది. పీకే టీం ప్రకారం..నెల్లూరు, బాపట్ల, ఏలూరు, అమలాపురం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, అనంతపురం, హిందూపురం, చిత్తూరు ఎంపీలకు ప్రతికూలత ఎక్కువ ఉందని తెలుస్తోంది. వీరి స్థానాల్లో కొత్తవారిని బరిలో దించడం బెటర్ అని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఎలాగో నరసాపురంలో రఘురామ ప్లేస్‌లో కొత్త నాయకుడుని దించాల్సిందే. మొత్తానికి చూసుకుంటే సగానికి సగం ఎంపీలపై వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.