ఈఢీ : జ‌గ‌న్ అయితే హార్డ్ డిస్కులు ఇచ్చాడు మ‌రి రాహుల్ ?

-

ఈడీ కేసులో వేగం ఏమ‌యినా బాగుందా అని చాలా మంది కాంగ్రెస్ నాయ‌కులు పెద‌వి విరుస్తున్నారు. రాజ‌కీయంగా ఈ కేసు త‌రువాత ఊసు అంతగా ప‌నికి రాద‌న్న వాద‌న కూడా ఉంది. జ‌గ‌న్ అయితే ఈడీ కేసులను, సీబీఐ విచార‌ణ‌ల‌ను చురుగ్గానే త‌న‌కు అణుగుణంగా వాడుకున్నారు క‌దా! మ‌రి! ఆ పాటి రాహుల్ చేయలేరా అని కూడా కొన్ని వాద‌న‌లు రాహుల్-కు సంబంధించి అనుకూలంగానో, ప్ర‌తికూలంగానో వినిపిస్తున్నాయి. వాటి తీరు ఎలా ఉన్నా.. జ‌గ‌న్ మాత్రం ఆ రోజు ఈడీకి ఎంత‌గానో స‌హ‌క‌రించారు.

ఇత‌ర ద‌ర్యాప్తు అధికారుల‌కూ చాలా అంటే చాలా మ‌ర్యాద చేశారు. ద‌ర్యాప్తు అధికారులు సాక్షి కాంపౌండ్-లోకి  రావ‌డానికే వీల్లేద‌ని మాత్రం జ‌గ‌న్ హుకుం జారీ చేయ‌లేదు. అదేవిధంగా సాక్షిలో సోదాల‌కూ, పత్రికా స్వేచ్ఛ‌కూ లింక్ పెట్ట‌లేదు కూడా !
ఆ విధంగా జ‌గ‌న్ హుందాగానే ఉన్నారు ఆ రోజు. మ‌రి ! రాహుల్ ఎందుకు బెంబేలెత్తిపోతున్నారో అర్థం కావ‌డం లేదు అని కొంద‌రు అంటున్నారు. కొంద‌రు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు కూడా ! వీలున్నంత వ‌ర‌కూ  జ‌గ‌న్ కానీ రాహుల్ కానీ ప్ర‌జ‌ల‌కు మేలు చేసే ప‌నే చేయాలి. కానీ ఎందుక‌నో కొన్ని ఆర్థిక సంబంధ నేరారోప‌ణ‌ల్లో ఇరుక్కుపోయారు. జ‌గన్ కేసు న‌మోదు ద‌ర్యాప్తు అయి ప‌దేళ్లు దాటిపోయింది. ఇంత వ‌ర‌కూ అతీగ‌తీ లేదు. కానీ రాహుల్ విష‌యంలో మాత్రం ఈడీ ప్ర‌తి మాట రాసుకుంటుంద‌ని తెలుస్తోంది. ద‌ర్యాప్తులు త‌ప్పులు మాట్లాడితే ఒప్పుకోవ‌డం లేద‌ని  కూడా తెలుస్తోంది.

ఏదేమ‌యినా..రాహుల్ అరెస్టుకు క్రేజ్ రాలేదు కానీ జ‌గ‌న్-ను ఆ రోజు అరెస్టు చేస్తే అంద‌రి క‌న్నా ఎక్కువ‌గా సొంత మీడియా ఆఫీసులోనే చ‌ర్చ‌లు న‌డిచేయి.మ‌రి ! ఆ రోజు జగ‌న్ ద‌ర్యాప్తు అధికారుల‌కు హార్డ్ డిస్క్ లు ఇచ్చారు. అదేవిధంగా ఆడిట‌ర్  సాయి (ఇప్ప‌టి ఎంపీ విజ‌య సాయి రెడ్డి) కూడా వీలున్నంత మేర‌కు త‌న ద‌గ్గర ఉన్న అంకెలు అన్నీ  చ‌దివి వినిపించేశారు. అయోధ్య రామిరెడ్డి లాంటి వాళ్లు , నిమ్మ‌గ‌డ్డ లాంటి వాళ్లు ఇరుకున ప‌డ్డామ‌ని బాధ‌ప‌డినా కూడా త‌రువాత సర్దుకుపోయారు. కానీ ఈ కేసులో సోనియా, రాహుల్ త‌ప్ప ఇంకెవ్వ‌రూ లేరు.. ఉండ‌రు కూడా ! ఎందుకంటే అది గాంధీల కుటుంబం చేసిన స్కాం అని  ఎన్న‌డో తేలిపోయింది క‌నుక ! ఇక ఈడీ గోల త‌రువాత,   సీబీఐ ద‌ర్యాప్తు త‌రువాత జైలుకు వెళ్లి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ ద‌శ మారిపోయింది. సానుభూతి లేదా స‌హానుభూతి బాగానే ప‌నిచేసి ఆయ‌న్ను సీఎంను చేసింది. మ‌రి! ఇదే సెంటిమెంట్ రాహుల్ కు వ‌ర్తిస్తుందా ? ఏమో ! గుర్రం ఎగ‌రావ‌చ్చు. రంగుల రంగుల రింగుల క‌ల‌లు నెరవేర‌నూవ‌చ్చు ! స్వ‌ప్న కాల స‌మ‌యాలు అన్నీ నిజాల‌నే ఆవిష్క‌రింప‌జేయ‌నూవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news