ప్రకాశం జిల్లా గిద్దలూరు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపి అభ్యర్థికి మద్ధతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ రాష్ర్ట భవిష్యత్ కోసం త్యాగం చేశానని.. కూటమి ప్రభుత్వం రాగానే తెలుగు గంగ, గుండ్లమోటు ప్రాజెక్టులను ఏకం చేస్తామని తెలిపారు.. గిద్దలూరులో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. జగన్ వెలుగొండ ప్రాజెక్టు పూర్తికాకపోయినా సొరంగాలు తవ్వి ప్రాజెక్ట్ ప్రారంభించారని, కూటమి ప్రభుత్వం రాగనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతాంగానికి సాగు, తాగు నీళ్ళు అందిస్తామని తెలిపారు. శ్రీకృష్ణ దేవరాయులు తవ్విన కంభం చెరువుని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
నేను రైతు పక్షపాతిని.. గిద్దలూరు అభివృద్ధికి తోడ్పడతానన్నారు జనసేనాని. ప్రభుత్వ కల్తీమద్యం .. ఎంతో మంది మరణాలకు కారణం అయిందని ఆరోపించారు. ఆత్మగౌరవం లేక పోవడంతో వైసీపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూటమి పార్టీలోకి వచ్చారని అన్నారు. జగన్ ఓటు విధేయతతో అగడంలేదని.. రౌడీయిజంతో ఓటు అడుగుతున్నారు అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ను ఇంటికి పంపించాలని.. ప్రజలు జగన్ కు వెన్నులో నుంచి భయం తెపించాలని అన్నారు.