మోదీ, ఆర్థికమంత్రి నిర్మలమ్మతో జగన్ భేటీ

-

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి.. అక్కడి నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీకి చేరుకున్న జగన్ కు ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన జగన్.. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిధులపై కూడా అమిత్ షా తో చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు అమిత్ షా తో జగన్ చర్చలు జరిపారు.

CM Jagan Mohan Reddy meets Prime Minister Modi to discuss key projects in  Andhra Pradesh - India Today

ప్రధాని నరేంద్ర మోదీతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు ప్రధానితో సమావేశమైన జగన్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news