జమ్మలమడుగులో హోరాహోరీ..సంచలన వ్యూహంతో జగన్!

-

ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు జరగని నియోజకవర్గం లేదు..అనే పరిస్తితి ఎందుకంటే దాదాపు చాలా స్థానాల్లో వైసీపీ నేతల మధ్య పోరు నడుస్తోంది. సొంత ఎమ్మెల్యేల వైఖరిని వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ సారి గాని తమ ఎమ్మెల్యేలకు సీటు ఇస్తే..తామే ఓడిస్తామని చెబుతున్నారు. అంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదే తరుణంలో వైసీపీ కంచుకోటగా ఉన్న జమ్మలమడుగులో కూడా ఆధిపత్య పోరు ఉంది.

ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి ఉన్నారు..అదే సమయంలో టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వచ్చిన రామసుబ్బారెడ్డిది ప్రత్యేక వర్గంగా ఉంది. అయితే సుబ్బారెడ్డి..కలవడానికే చూశారు గాని..సుధీర్ రెడ్డి కలుపుకోలేదని తెలిసింది. దీంతో సుబ్బారెడ్డి సెపరేట్ వర్గం నడుపుతున్నారు. అటు గత ఎన్నికల్లో గంగవరం శేఖర్ రెడ్డి..సుధీర్ విజయానికి కృషి చేశారు. కానీ గెలిచాక సుధీర్..శేఖర్‌ని పట్టించుకోలేదని తెలిసింది. శేఖర్ వర్గాన్ని దూరం పెడుతూ వచ్చారట. దీంతో అసంతృప్తితో ఉన్న శేఖర్..సెపరేట్ గా వర్గ రాజకీయం నడిపిస్తున్నారు. ఇలా వర్గ రాజకీయం జమ్మలమడుగులో వైసీపీకి షాక్ ఇచ్చేలా ఉంది.

సొంత జిల్లాలోనే ఈ పరిస్తితి ఉంటే మిగతా జిల్లాల్లో ఇంకా ఇబ్బంది అని తెలుసుకున్న జిల్లా..ఆ పోరుని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు. దీంతో ఆయనకు..నెక్స్ట్ ఎన్నికల్లో సీటు లేదని తేలిపోయింది..ఇక సుధీర్‌కు సహకరించాల్సిన పరిస్తితి ఉంది. అటు శేఖర్‌ని సైతం బుజ్జగించే పనిలో ఉన్నారు.

ఆయన్ని కూడా బుజ్జగించి..పార్టీకి అనుకూల వాతావరణం తీసుకురావాలని చూస్తున్నారు. అటు సుధీర్‌కు నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది..ఆ పరిస్తితిని సరిదిద్దుకోవాలని జగన్ సూచించారు. సంక్షేమ పథకాలు…జమ్మలమడుగులో వస్తున్న స్టీల్ ప్లాంట్ పై ప్రచారం చేసుకుని మైలేజ్ పెంచుకోవాలని సూచించరాట. అలాగే అందరినీ కలుపుకుని వెళ్లాలని జగన్..సుధీర్‌కు దిశానిర్దేశం చేశారని తెలిసింది. అలా పనిచేస్తేనే నెక్స్ట్ జమ్మలమడుగులో సుధీర్‌కు గెలిచే అవకాశాలు ఉన్నాయి. లేదంటే రిస్క్ తప్పదు.

 

Read more RELATED
Recommended to you

Latest news